Telugu Gateway
Telangana

కెసీఆర్ కు సత్యం రామలింగరాజు గతే

కెసీఆర్ కు సత్యం రామలింగరాజు గతే
X

కాగ్ నివేదిక తెలంగాణలో ప్రతిపక్షాలకు ఓ పెద్ద అస్త్రంగా దొరికింది. సీఎం కెసీఆర్ లెక్కలన్నీ దొంగ లెక్కలనే విషయం కాగ్ రిపోర్టుతో తేలిపోయిందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. సర్కారుకు ధైర్యం ఉంటే ఈ నివేదికపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని శ్రవణ్ సవాల్ విసిరారు. సీఎం కెసీఆర్ కు కూడా సత్యం రామలింగరాజుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అప్పులు తెచ్చిన డబ్బులను కూడా ఆదాయంగా చూపించి..తెలంగాణ మిగులు రాష్ట్రం అని రాష్ట్రంలో అందరినీ భ్రమింపచేశారని మండిపడ్డారు. సత్యం రామలింగరాజు తరహాలోనే లెక్కల్లో అవకతవకలు చేశారని ఆరోపించారు. ఇది పెద్ద నేరం అని పేర్కొన్నారు. సర్కారు వైఫల్యాలను కాగ్ కళ్ళకు కట్టినట్లు చూపిందని అన్నారు. ఇఫ్పటికైనా కెసీఆర్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. మరో ప్రతిపక్షం బిజెపి కూడా కాగ్ నివేదికలోని అంశాలపై సర్కారుపై మండిపడింది. లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. నాలుగేళ్లు కావస్తున్నా వెయ్యి సరిపడా ఇండ్లు కూడా నిర్మించలేదని లక్ష్మణ్ తెలిపారు. టీఆర్ఎస్ చేసిన మోసాలు, చెయ్యకూడని పనులు ఎలా ఉన్నాయో అందులో స్పష్టంగా ఉంది. గొప్పలకు పోయి వివిధ సంస్థల నుండి అప్పుతెచ్చి మీ ఆస్తులుగా చూపడమే సర్కార్ దిగజారుడు తనానికి నిదర్శనం.

పైగా అప్పులు చేయని రాష్ట్రమే లేదంటూ బీరాలు పలికారు. ఓట్లు రాబట్టే ప్రయత్నమే తప్ప, అభివృద్ధి, సంక్షేమం అనే విషయాలను పట్టించుకోలేదు. లక్షల డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ కేవలం 1000 ఇండ్లు కూడా పూర్తి చేయలేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో రూ. 800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మిషన్ కాకతీయలో పనులన్నీ నత్త నడకన సాగుతున్నాయి. సకాలంలో రుణాలు ఇవ్వకపోవడంతో 15 లక్షల మంది రైతులు నష్టపోయారు. ఇన్నేళ్లయినా మిషన్ భగీరథ ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. బడి మానేస్తున్న పిల్లల సంఖ్య తగ్గిపోతున్న సర్కార్ పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు తగ్గాయి. కానీ కేసీఆర్ కిట్స్ వచ్చాక పెరిగాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట తప్పవని కాగ్ నివేదిక తేల్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు తగ్గాయి..కేసీఆర్ కిట్స్ వచ్చాక పెరిగాయన్నారు...తప్పని కాగ్ చెప్పింది..యూనివర్సిటీల్లో నియామకాలు లేవు అని లక్ష్మణ్ విమర్శించారు.

Next Story
Share it