Telugu Gateway
Cinema

‘నేలటిక్కెట్’ విడుదల ముహుర్తం ఖరారు

‘నేలటిక్కెట్’ విడుదల ముహుర్తం ఖరారు
X

లాంగ్ గ్యాప్ తర్వాత రేసులో దిగిన మాస్ మహారాజా రవితేజ వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు అంటూ దూసుకెళ్ళిన ఈ హీరో ఇప్పుడు నేల టిక్కెట్ తో రెడీ అయిపోయాడు. ఈ సినిమా కూడా సమ్మర్ లోనే సందడి చేయనుంది. నేలటిక్కెట్ ను మే 24న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ‘సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్‌.. వేడుక చూద్దాం’ వంటి కుటుంబ కథా చిత్రాలతో మంచి విజయాలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ. ఈ సినిమాలో రవితేజకు జోడీ మాళవిక శర్మ నటించారు. ఈ సినిమా ఇఫ్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. మరో మూడు పాటలు చిత్రీకరించాల్సి ఉంది.

Next Story
Share it