‘రంగస్థలం’ రివ్యూ ఇచ్చేశాడు

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా రంగస్థలం. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఈ సినిమాను 1700 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సమ్మర్ లో వస్తున్న తొలి భారీ బడ్జెట్ చిత్రం ఇదే. రామ్ చరణ్, సమంత జోడీగా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రదాన కారణం డైరక్టర్ సుకుమార్ కావటం ఒకెత్తు అయితే..పాటలు కూడా దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా ఎంతసక్కగున్నావే, రంగమ్మ మంగమ్మ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు పూజా హెగ్డె సందడి చేసిన ఓ ఐటెం సాంగ్ ఉండనే ఉంది. యూఏఈకి చెందిన సినీ విమర్శకుడు ఉమైర్ సంధూ ‘రంగస్థలం’పై తన తొలి రివ్యూను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.
ఫుల్ పైసా వసూల్ మసాలా ఫ్లిక్‌గా అభివర్ణించారు. రామ్ చరణ్, సమంత, జగపతి బాబు అద్భుతంగా నటించారంటూ ఆకాశానికి ఎత్తేశారు. అద్భుతమైన కథతో సుకుమార్ తెరకెక్కించాడని, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ రాకింగ్‌గా ఉందంటూ కితాబిచ్చారు. అంతటితో ఆగకుండా సినిమాకు రేటింగ్ కూడా ఇచ్చేశారు. ఎంత పెద్ద సినిమా అయినా ఫస్ట్ రివ్యూ ఆయనదే. కాకపోతే ఆయన రివ్యూలు అన్నీ పక్కాగా ఉంటాయని చెప్పటానికి వీల్లేదు. ఆయన సూపర్ అని చెప్పిన సినిమాలు కూడా బాక్సీఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అంటే రంగస్థలం మీద అనుమానం వ్యక్తం చేయటం కాదు కానీ..మరికొన్ని గంటల్లో భారత్ లో సినిమా చూసిన తర్వాత ఒరిజినల్ రివ్యూలే రానున్నాయి. అప్పటివరకూ అభిమానులకు టెన్షన్ టెన్షనే. ఉమైర్ సంధు అయితే ఈ సినిమాకు 5కు 3.5 రేటింగ్ ఇచ్చేశాడు.
తెలంగాణ బిజెపికి టీఆర్ఎస్ షాక్
30 Jun 2022 3:16 PM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTహైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ళ యూనిట్లు 82,220
30 Jun 2022 7:40 AM GMT
ఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT