Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘కాలా’ టీజర్ వచ్చేసింది

0

‘కాలా అంటే ఎవరు?. కాలుడు. కలికాలుడు.గొడవ పడి అయినా సరే కాపాడేవాడు.’ ఇదీ రజనీకాంత్ కొత్త సినిమా కాలా టీజర్ లో రజనీకాంత్ ఎంట్రీ సమయంలో వచ్చే డైలాగులు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న కాలా సినిమా టీజర్ ఎట్టకేలకు శుక్రవారం ఉదయం విడుదలైంది. తమిళ టీజర్ ముందు..ఆ తర్వాత తెలుగు టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రముఖ హిందీ నటుడు నానా పటేకర్ విలన్ గా నటిస్తున్నారు.  ‘వీరయ్య బిడ్డని రా.. ఒక్కడినే ఉన్నా.. దిల్‌ ఉంటే గుంపుగా రండి’ అనే డైలాగ్స్‌  అదరగొడుతున్నాయి.

- Advertisement -

ధనుష్‌ వండర్‌ బార్‌ ఫిలిమ్స్ నిర్మాణంలో పా. రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 27న విడుదల కానుంది.    నానా నటిస్తున్న తొలి దక్షిణాది సినిమా ఇదే కావటం విశేషం. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతమందించారు. టీజర్‌ గురువారమే రిలీజ్‌ కావాల్సి ఉండగా  కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మరణం నేపథ్యంలో ఆయన గౌరవార్థం టీజర్‌ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ధనుష్‌ ట్విటర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

 

Leave A Reply

Your email address will not be published.