Telugu Gateway

కాంగ్రెస్ ప్లీనరీలో ‘ఫ్రత్యేక హోదా’ అంశం

కాంగ్రెస్ ప్లీనరీలో ‘ఫ్రత్యేక హోదా’ అంశం
X

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ గందరగోళ పరిస్థితులను కొంత మేరకు అయినా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయింది. అందులో భాగంగానే ప్లీనరీలో పెట్టిన తీర్మానంలో ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. అంతే కాదు..హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఇప్పటివరకూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ప్రకటన చేసినప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపితో పాటు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని తెలిపారు.

తాము అధికారంలోకి వచ్చాక విభజన హామీలు అన్నింటిని అమలు చేస్తామని ప్రకటించారు. దేశంలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం విద్వేషం నింపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీనే అందరినీ ఏకతాటిపై ఉంచగలగదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా రాహుల్ గాంధీ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేస్తామని ప్రకటించారు.

Next Story
Share it