కెసీఆర్ తో ప్రకాష్ రాజ్ భేటీ
BY Telugu Gateway29 March 2018 3:55 PM IST

X
Telugu Gateway29 March 2018 3:55 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా బిజెపి సర్కారుపై కత్తులు దూస్తున్న ప్రకాష్ రాజ్ సడన్ గా కెసీఆర్ తో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. అంతే కాదు...కెసీఆర్ తో కలసి ఆయన అసెంబ్లీకి వెళ్ళారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కెసీఆర్ ఈ భేటీలో ప్రకాష్ రాజ్ తో ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్, బిజెపియేతర కూటమి కోసం అంటూ కెసీఆర్ కొద్ది రోజుల క్రితం కలకత్తా వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయిన విషయం తెలిసిందే.
Next Story