Telugu Gateway
Movie reviews

‘కిరాక్ పార్టీ’ మూవీ రివ్యూ

‘కిరాక్ పార్టీ’ మూవీ రివ్యూ
X

టాలీవుడ్ లోని యువ హీరీల్లో నిఖిల్ ది విభిన్నమైన శైలి. వెరైటీ చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. నిఖిల్, సిమ్రాన్ పరింజా, సంయుక్తా హెగ్డెలు నటించిన ‘కిరాక్ పార్టీ’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గత సినిమాల తరహాలోనే నిఖిల్ ఈ సినిమాలో వినూత్నతను చాటుకున్నారో లేదో చూద్దాం పదండి. కన్నడ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. సినిమా అంతా కాలేజీ బ్యాక్ డ్రాప్ లోనే ముందుకు సాగుతుంది. చాలా సినిమాల్లో ఉన్నట్లే ఇందులోనూ సీనియర్లు..జూనియర్ల మధ్య జరిగే ఫైటింగ్ లు..పంచాయతీలే ఎక్కువ కన్పిస్తాయి. మధ్యలో సహజంగా ఉండే లవ్ ట్రాక్. కృష్ణ (నిఖిల్) తన స్నేహితులతో కలసి ఓ కారు కొంటాడు. కాలేజీలో గ్యాంగ్ ను మెయింటెన్ చేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. అదే సమయంలో సీనియర్ స్టూడెంట్ అయిన మీరా (సిమ్రాన్ పరాంజా) ప్రేమలో పడతాడు. గ్యాంగ్ అంతా అదే పనిచేసినా చివరకు మీరా కూడా కృష్ణతోనే ప్రేమలో పడుతుంది. మరి వీరిద్దరి ప్రేమ సఫలం అయిందా? లేదా వెండితెరపై చూడాల్సిందే.

ఈ సినిమాలో నిఖిల్ తనదైన నటనతో ఆకట్టుకన్నాడు. హీరోయిన్ సిమ్రాన్ పరాంజ తన నటనతో మంచి మార్కులే దక్కించుకుంది. మరో హీరోయిన్ గా నటించిన సంయుక్త హెగ్డె కూడా తన చలాకీతనంతో ఓకే అన్పించింది. కొన్ని పాటలు ఆకట్టుకున్నాయి. అక్కడక్కడా కామెడీ ఉంది. కొన్ని సెంటిమెంట్లు సీన్లు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. యూత్ ఫుల్ సినిమాగా తెరకెక్కిన కిరాక్ పార్టీ యూత్ ను కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించటంలో దర్శకుడు విఫలమయ్యాడనే శరన్ కొప్పిశెట్టి విఫలమయ్యారని చెప్పొచ్చు. నిఖిల్ అభిమానులను కూడా ఈ సినిమా నిరాశపర్చేలా ఉంది.

రేటింగ్. 2.25/5

Next Story
Share it