మాట తప్పితే మనిషే కాదు

‘భరత్ అనే నేను’ సినిమాలో హీరో మహేష్ బాబు డైలాగ్ ఇది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు సంబంధించి ఇందులో పలు పవర్ ఫుల్ డైలాగ్ లు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మంగళవారం విడుదలైంది. రాష్ట్ర సారధిగా హీరో విజన్ ఎలా ఉండబోతోందో ‘విజన్ ఆఫ్ భరత్’ పేరుతో ఈ టీజర్ విడుదల చేశారు. ‘ఒక్కసారి ప్రామిస్ చేసి మాట తప్పితే, నువ్వసలు మనిషివేకాదు’, ‘ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి’ లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి.
ఏప్రిల్ 20న భరత్ సీఎంగా చార్జ్ తీసుకుంటారని చిత్ర బృందం తెలిపింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సమ్మర్ సీజన్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు ఢీ అంటే ఢీ అనాల్సి ఉన్నా..నిర్మాతలు రాజీకి వచ్చి విడుదల తేదీలు సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే.
https://www.youtube.com/watch?v=orkPrGSAETs