Telugu Gateway
Telangana

కెసీఆర్ థర్ట్ ఫ్రంట్ అట్టర్ ఫ్లాప్ కానుందా!

కెసీఆర్ థర్ట్ ఫ్రంట్ అట్టర్ ఫ్లాప్ కానుందా!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రతిపాదించిన థర్ట్ ఫ్రంట్ అట్టర్ ఫ్లాప్ కానుందా?. అంటే ఔను అంటున్నాయి రాజకీయ వర్గాలు. లెక్కలు కూడా అదే చెబుతున్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే కెసీఆర్ కు జాతీయ రాజకీయాలు కలిసొచ్చే అంశాలు ఏమీ కన్పించటం లేదు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి కెసీఆర్ చెప్పే ప్రధాన కారణాలు రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం తగ్గాలి. జాతీయ పార్టీలు అయిన బిజెపి, కాంగ్రెస్ లు దేశగతిని మార్చటంలో ఘోరంగా విఫలమయ్యాయి. రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇచ్చి కేంద్రం పరిమిత పాత్ర మాత్రమే పోషించాలి. ఇదీ కెసీఆర్ ఆయన వాదన. అయితే దేశంలోని 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాలు ప్రస్తుతం కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బిజెపి చేతిలోనే ఉన్నాయి. మరి కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉన్న తరుణంలో ఎవరు తమకు ఎక్కువ అధికారాలు కావాలని బిజెపికి వ్యతిరేకంగా కెసీఆర్ తో జతకడతారు? అన్నది కీలక ప్రశ్నగా మారనుంది. బిజెపి పాలిత రాష్ట్రాలు కెసీఆర్ కోరకుంటున్నట్లు కేంద్రంలో పోరాడతాయా? అంటే సాధ్యంకాదనే చెప్పొచ్చు. కర్ణాటక, పంజాబ్, పాండిచ్చేరి వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కెసీఆర్ తో కలసి పనిచేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన జాతీయ రాజకీయాల్లో పోరాటం చేస్తామనేది బిజెపి, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కాబట్టి. మరి దాదాపు 25 రాష్ట్రాలు ఏ రకంగా చూసుకున్నా కెసీఆర్ వైపు చూసే పరిస్థితి ఏ మాత్రం కన్పించటం లేదు.

మరి జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కెసీఆర్ ఎవరితో కలసి ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేస్తారు. ఆయనతో ఎవరు కలసి వస్తారు? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వచ్చినట్లే వచ్చిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా తూచ్..అంటూ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయారు. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక సాధ్యం కాదని నమ్ముతున్నారు. మరి ఈ లెక్కన కెసీఆర్ పక్కన నిలబడేది ఎవరు?. చూస్తుంటే తెలంగాణ సీఎం కెసీఆర్ జాతీయ రాజకీయ వ్యవహారం ఏమాత్రం ఫలించే సూచనలు కన్పించటం లేదు. అసలు సొంత పార్టీ నేతలే కెసీఆర్ ప్రకటనలు చూసి అవాక్కు అవుతున్నారు. ఎందుకింత సడన్ గా...కెసీఆర్ ఇంతటి కీలక ప్రకటనలు చేశారనేది ఆ పార్టీ నేతలకు అంతుచిక్కటం లేదు. మరి రాబోయే రోజుల్లో కెసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో వేచిచూడాల్సిందే. అయితే జాతీయ రాజకీయాలపై ఫోకస్ పేరుతో సాగుతున్న హంగామా వల్ల వస్తే ఎంపీల సీట్ల విషయంలో టీఆర్ఎస్ కు ఒకింత సానుకూలత రావొచ్చని భావిస్తున్నారు.

Next Story
Share it