Telugu Gateway
Telangana

స్టేట్ లో కష్టమనే..కెసీఆర్ సెంటర్ పై కన్నేశారా?

స్టేట్ లో కష్టమనే..కెసీఆర్ సెంటర్ పై కన్నేశారా?
X

‘మాట్లాడితే వంద సీట్లు. 106 సీట్లు. 103 సీట్లు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖల మంత్రులు కెటీఆర్ మొదలుకుని టీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్పే మాట. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. అంతర్గత సంభాషణల్లో కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అగ్రనేతల మాటలకు భిన్నమైన పరిస్థితిని ఆవిష్కరిస్తున్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనే కాకుండా..టీఆర్ఎస్ కు అత్యంత పట్టు ఉన్న ఉత్తర తెలంగాణలోనూ ఇప్పుడు గులాబీ పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయని పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే కెసీఆర్ ఇప్పుడు ఆకస్మికంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారని..ఈ చర్య ద్వారా ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకోవటం ద్వారా అవసరం అయితే కేంద్రంలో అయినా ‘చక్రం’ తిప్పాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే చర్చరాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కెసీఆర్ తాజా ప్లాన్స్ ప్రకారం ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా..ఎంపీల సీట్లను పెంచుకోవటం ఒకింత సులభం అవుతుందని ఆలోచన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

ఇంత కాలం ‘బంగారు తెలంగాణ’నే తన లక్ష్యం అని ప్రకటిస్తూ వచ్చిన కెసీఆర్ మరి మధ్యలోనే బంగారు తెలంగాణను ఎలా వదిలేస్తారన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఎంతో కాలం పోరాడి సాధించుకున్న తెలంగాణ ను తాను ఒక్కడిని మాత్రమే సరైన గాడిలో పెట్టగలనని కెసీఆర్ పదే పదే ప్రకటించుకున్నారు. అందుకే దళిత ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోలేదని..దళితులు కూడా కెసీఆర్ సీఎం కావాలని టీఆర్ఎస్ నేతలు పదే పదే బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఏ అంశాలపై ఫోకస్ పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారో అందులో చాలా అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని..మరి వీటన్నింటిని వదిలేసి కెసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై ఎందుకు ఫోకస్ పెడుతున్నారంటే తెలంగాణ గ్రౌండ్ లో టీఆర్ఎస్ పరిస్థితి ఆశాజనంగా లేదనే వాదన విన్పిస్తోంది.

Next Story
Share it