Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ ఏప్రిల్ 12 నుంచే

ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్  ఏప్రిల్ 12 నుంచే
X

ఎదురుచూపులకు బ్రేక్. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 12 నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా కోసం యంగ్ టైగర్ చాలా కష్టపడి మరీ కొత్త లుక్ కోసం ప్రయత్నం చేశారు. ఈ లుక్ బహిర్గతం కాకూడదనే ఉద్దేశంతోనే సోదరుడు కళ్యాణ్ మార్ చిత్రం ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. ప్రతి సినిమాకు డిఫరెంట్ గా కన్పిస్తూ వరసగా విజయాలు అందుకుంటున్నాడు ఎన్టీఆర్.

ఈ కొత్త సినిమా త్రివిక్రమ్, యంగ్ టైగర్ కావటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది. ఈ సినిమాను దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమా నిర్మాణ సంస్థగా ఉంది. సాధ్యమైనంత వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి రాజమౌళి కొత్త సినిమాకు ఎన్టీఆర్ రెడీ కాబోతున్నాడు. ఈ కొత్త సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు.

Next Story
Share it