ట్యాక్సీవాలాగా మారిన అర్జున్ రెడ్డి
BY Telugu Gateway24 Feb 2018 9:45 AM IST
X
Telugu Gateway24 Feb 2018 9:45 AM IST
అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమాతో రెడీ అయ్యాడు. అర్జున్ రెడ్డిలా డాక్టర్ గా యాక్ట్ చేసిన ఈ కుర్రహీరో..ఇప్పుడు ‘ట్యాక్సీవాలా’గా సందడి చేయనున్నాడు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ లు నటిస్తున్నారు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి వంటి సినిమాలు సూపర్ హిట్ కావటంతో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంపైనే అందరి చూపులు ఉన్నాయి. ట్యాక్సీవాలా సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Next Story