Telugu Gateway
Movie reviews

‘టచ్ చేసి చూడు’ మూవీ రివ్యూ

‘టచ్ చేసి చూడు’ మూవీ రివ్యూ
X

రవితేజ సెకండ్ ఇన్నింగ్స్ తో ప్రారంభించిన సినిమానే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే ‘రాజా ది గ్రేట్’. ఈ సినిమాలో అంథుడిగా నటించిన రవితేజ సినిమా ఆసాంతం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్ టైన్ చేయటంలో సక్సెస్ అయ్యాడు. అప్పటి నుంచి వరస పెట్టి సినిమాలు అంగీకరిస్తూ దూసుకెళ్తున్నాడు. అందులో భాగంగానే శుక్రవారం నాడు రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఈ మాస్ మహారాజాకు జోడీగా రాశీఖన్నా, సీరత్ కపూర్ లు సందడి చేశారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించగా...విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మరి రవితేజ రాజా ది గ్రేట్ తరహాలోనే ఈ సినిమాలోనూ ప్రేక్షకులను అలరించాడా..లేదా? ఓ సారి లుక్కేయండి.

ఇక అసలు కథ విషయానికి వస్తే కార్తికేయ (రవితేజ) కుటుంబాన్ని అప్యాయంగా చూసుకునే వ్యక్తి. తన ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకు కూడా నిత్యం అదే విషయం చెబుతూ ఉంటాడు. కానీ ఓ రోజు కార్తికేయ తండ్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురవుతాడు. బలమైన కారణం ఏమీ లేకపోయినా కార్తికేయ పెళ్లి కాలేదనే దిగులుతోనే అలా అయ్యాడు అని చెబుతాడు డాక్టర్. అప్పటి నుంచి కార్తికేయకు పెళ్లి సంబంధాలు వెతికే పనిలో పడతారు కార్తికేయ కుటుంబ సభ్యులు. అందులో భాగంగా పుష్ప (రాశీ ఖన్నా) ఇంటికి వెళతారు. కానీ అక్కడ జరిగే సీన్లతో ఆ అమ్మాయే కార్తికేయను పెళ్లి చేసుకోవటానికి నిరాకరిస్తుంది. అసలు పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న కార్తికేయ కంపెనీ ఎందుకు నడుపుకోవాల్సి వచ్చింది.

పోలీసు అధికారి ఉన్న సమయంలో కార్తికేయ టెంపర్ మెంట్, డ్యూటీలో కమిట్ మెంట్ ఎలా ఉంటుందో వెండితెరపై చూడాల్సిందే. ఇక సినిమాలో పాత్రల విషయానికి వస్తే హీరో రవితేజకు ఇది అలవాటైన సబ్జెక్ట్ కావటంతో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. డీజీపీ పాత్రలో నటించిన మురళీ శర్మ ది ఈ సినిమాలో కీలకపాత్రే. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే రాశీఖన్నా, సీరత్ కపూర్ ల పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. ఈ సినిమాలో ఫ్రెడ్డీదారువాలా పాత్ర కూడా అంత పవర్ ఫుల్ గా ఏమీలేదు. అక్కడక్కడ వెన్నెల కిషోర్ నవ్వులు పూయిస్తాడు. సినిమాలో చెప్పుకోదగ్గ పాటలు కూడా ఏమీలేవు. ఓవరాల్ చూస్తే ‘టచ్ చేసి చూడు’ రవితేజ అభిమానులకు కూడా రాజా ది గ్రేట్ అంత కిక్ ఇవ్వదు. కాకపోతే ఓ సారి చూసేయదగ్గ సినిమానే.

రేటింగ్. 2.75/5

Next Story
Share it