గుండు హనుమంతరావు మృతి
BY Telugu Gateway19 Feb 2018 6:02 AM GMT

X
Telugu Gateway19 Feb 2018 6:02 AM GMT
గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న సీనియర్ హస్యనటుడు గుండు హనుమంతరావు మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. గుండు హనుమంతరావు వయస్సు 61 సంవత్సరాలు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. హనుమంతరావు 400 పైగా సినిమాల్లో నటించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది. ‘అహనా పెళ్లంట’ సినిమాతో హనుమంత రావు సినీరంగ ప్రవేశం చేశారు. కొబ్బరిబోండాం, మాయలోడు, యమలీల, వినోదం సినిమాలతో మంచి హస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ సీరియల్స్ లోనూ నటించారు. గుండు హనుమంతరావు మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Next Story