Telugu Gateway
Cinema

ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతికకాయం

ప్రత్యేక విమానంలో శ్రీదేవి భౌతికకాయం
X

దుబాయ్ లో ఆకస్మికంగా మరణించి..కోట్లాది మంది అభిమానులను షాక్ కు గురిచేసిన శ్రీదేవి భౌతికకాయం ప్రత్యేక విమానంలో ముంబయ్ రానుంది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రత్యేక విమానం ఏర్పాటుకు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది. దుబాయ్‌లో శ్రీదేవీకి పోస్ట్‌ మార్టం ప్రారంభమైన సమయంలోనే ముంబై నుంచి అంబానీ విమానం బయలుదేరి వెళ్లింది. 13 సీట్లున్న ఈ ప్రత్యేక విమానం(ఎంబ్రార్‌-135బీజే) రిలయన్స్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అండ్‌ ట్రావెల్‌ లిమిటెడ్‌ది.

ఈ సంస్థ ప్రస్తుతం అనిల్‌ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తోంది. బోనికపూర్‌ మేనల్లుడు మొహిత్‌ మార్వా పెళ్లి కోసం రస్‌ ఆల్‌ ఖైమాకు వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని రషీద్‌ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. అయితే, దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతోంది. సోమవారం మధ్యాహ్నాంలోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది. శ్రీదేవి పార్థివదేహాన్ని మొదట ఆమె ఇంటికి తరలిస్తారు. అటు నుంచి మెహబూబా స్టూటియోకు తీసుకెళతారు. అనంతరం జుహూలోని శాంతా క్రజ్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Next Story
Share it