Telugu Gateway
Telangana

కెసీఆర్ హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం

కెసీఆర్ హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మంగళవారం నాడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో ఉన్న బ్యాగులో పొగ రావటం ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే పొగలు వస్తున్న బ్యాగును భద్రతాలో సిబ్బందిలో ఒకరు పరుగెత్తుకుంటూ వెళ్ళి హెలిప్యాడ్ చివర్లో పడేసి వచ్చారు. తర్వాత హెలికాప్టర్ బయలుదేరి వెళ్లింది. అయితే సీఎం వంటి వివిఐపి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో ఏ మాత్రం భద్రతా ప్రమాణాలు పాటించకుండా బ్యాగులో ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా ఉంచారనే అంశంపై ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

హెలికాప్టర్ టేకాఫ్ అయ్యే సమయంలో ఈ ఘటన జరగటం వల్ల ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని..అదే గాల్లోకి ఎగిరాక మంటలు వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అన్న ఆందోళన భద్రతా వర్గాల్లో నెలకొంది. ఈ సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు. సీఎం హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఐటి శఆఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపానని, కేసీఆర్‌ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. ఆదిలాబాద్‌ టూర్‌లో సీఎం ఉన్నారని తెలిపారు. 'చింతించాల్సిన అవసరం లేదు ... ఆల్‌ ఇజ్‌ వెల్‌' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Next Story
Share it