స్కెచ్ మూవీ రివ్యూ
తమిళ సూపర్ స్టార్ విక్రమ్..మిల్కీబ్యూటీ తమన్నా స్కెచ్ వేశారు. గతంలో తమిళంలో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో స్కెచ్ పేరుతోనే విడుదల చేశారు. మరి వీరి స్కెచ్ కు తెలుగు సినీ ప్రేమికులు పడిపోయారా? లేదో చూద్దాం. విక్రమ్ గత కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మరి స్కెచ్ ఆయన్ను ఆదుకుందా?. ఇక సినిమా కథ విషయానికి వస్తే స్కెచ్ (విక్రమ్) ఓ వాహనాల ఫైనాన్షియర్ దగ్గర పనిచేస్తుంటాడు. ఎవరైనా నెలవారీ వాయిదాలు కట్టకపోతే వాహనాలు ఎత్తుకొచ్చేస్తుంటాడు. స్కెచ్ కు తోడు ఓ టీమ్ కూడా ఉంటుంది. వీరంతా కలిసే వాహనాలు ఎత్తుకొచ్చే పనిలో ఉంటారు. ఈ క్రమంలోనే కాలేజీలో స్కెచ్ కు తమన్నా పరిచయం అవుతుంది. తొలిసారి తమన్నా ను చూసినప్పటి నుంచి స్కెచ్ ప్రేమలో పడతాడు. అయితే తొలుత స్కెచ్ ను పోకిరీగా భావించిన తమన్నా తర్వాత మనసు తెలుసుకుని స్కెచ్ తో ప్రేమలో పడుతుంది. అయితే వాయిదాలు కట్టని కార్లు ఎత్తుకొచ్చే క్రమంలో స్కెచ్ విశాఖ నగరంలో ఓ పేరుమోసిన రౌడీ దగ్గర నుంచి కారు ఎత్తుకొస్తాడు. స్కెచ్ స్కెచ్ వేశాడంటే ఫెయిల్యూర్ ఉండదనే చందంగా వీరి దందా సాగుతుంది.
ఈ రౌడీ షీటర్ కారు ఎత్తుకొచ్చిన దగ్గర నుంచే అసలు కథ మొదలవుతుంది. రౌడీషీటర్ దగ్గర నుంచి కారు ఎత్తుకొచ్చాక స్కెచ్ స్నేహితులు వరస పెట్టి ప్రాణాలు ఎందుకు కోల్పోతారు. దీనికి కారకులు ఎవరు?. మరి స్కెచ్, తమన్నాల ప్రేమ సక్సెస్ అయిందా లేదా? వెండి తెరపై చూడాల్సిందే. ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే స్కెచ్ గా విక్రమ్ చాలా ఈజ్ గా నటించాడు. లుక్ లో చాలా రఫ్ గా కన్పిస్తూ కుర్రహీరోలకు తాను ఏ మాత్రం తీసిపోననే రీతిలో నటించాడు. తమన్నా రోల్ గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీలేదు. రొటీన్ హీరోయిన్ క్యారెక్టరే ఇందులోనూ. గ్యాంగ్ స్టర్ గా నటించిన బాబూరాజ్ ఓకే అన్పిస్తాడు. పాటలు కూడా ఏమీ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. సినిమాను మాత్రం చివర్లో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలనే సందేశంతో ముగిస్తాడు. ఓవరాల్ గా చూస్తే స్కెచ్ చూడాలని ప్లాన్ చేస్తు బుక్ అయిపోయినట్లే.
రేటింగ్. 2-5