రెజీనాకు సూపర్ ఛాన్స్

రెజీనా ఒక్క సినిమాతో సూపర్ ఛాన్స్ కొట్టేసింది. ఇంత వరకూ టాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ కే పరిమితం అయిన ఈ భామ ‘అ!’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీకి మార్గం సుగమం చేసుకుంది. గత సినిమాలకు భిన్నంగా రెజీనా వెరైటీ క్యారెక్టర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది. అ సినిమాలో రెజీనా క్యారెక్టర్ కు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కన్పించటంతోపాటు నటనలోనూ రెజీనా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ లో సోనమ్ కపూర్, రాజ్ కుమార్ రావు నటిస్తున్న చిత్రం ‘ఎక్ లడికీ కో దేఖా తో ఐసా లాగా’ సినిమాలో రెజీనా ఛాన్స్ కొట్టేసింది.
ఈ సినిమా దర్శకత్వం షెల్లీ ధార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ లో ఎంతో పేరున్న విధు వినోద్ చోప్రా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో అనిల్ కపూర్, జూహి చావ్లా నటిస్తున్నారు. హీరో నాని నిర్మాతగామారి తెరకెక్కించిన తొలి సినిమా అ. ఈ సినిమాలో రెజీనా మాదకద్రవ్యాలకు అలవాటుపడిన యువతిగా నటించి..ప్రేక్షకుల దగ్గర మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా క్యారెక్టరే ఆమెకు బాలీవుడ్ ఎంట్రీకి కారణం అయిందని ప్రచారం జరుగుతోంది.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT