Telugu Gateway
Telangana

టీవీ9పై రామ్ గోపాల్ వర్మ కేసు!

టీవీ9పై రామ్ గోపాల్ వర్మ కేసు!
X

ప్రముఖ తెలుగు ఛానల్ టీవీ9పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీరియస్ అయ్యారు. టీవీ9 ఛానల్ పేరును టీవీ9 సర్కస్ జోకర్స్ గా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ముంబయ్ లోని 27వ అంతస్థులో టెర్రస్ పై కూర్చుని టీవీ9లో వచ్చే న్యూసెన్సికల్..నాన్సెన్స్ రిపోర్ట్స్ ను చూస్తున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు. టివీ9 ఛానల్ తప్పుడు వార్తలు ప్రసారం చేయటంతోపాటు..రజనీకాంత్ వాస్తవాలకు మసిపూసిమారేడుకాయ చేస్తున్నారని వర్మ ఆరోపించారు.

దురుద్దేశపూరితంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. విచారణ సాగుతున్న అంశంపై లీక్ లు ప్రసారం చేయటం నేరం అని పేర్కొన్నారు. తాను చట్టప్రకారం ఛానల్ పై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. టీవీ 9 ఛానల్ పై వివిధ కేసులు దాఖలు చేసే పనిలో ఉన్నట్లు వర్మ తన ట్విట్టర్ పోస్టులో వెల్లడించారు. తన లాయర్లు దీనికి అవసరమైన సమాచారం సేకరించే పనిలో ఉన్నట్లు తెలిపారు.

Next Story
Share it