కొత్త సినిమాకు ఓకే చెప్పిన రజనీ
BY Telugu Gateway24 Feb 2018 4:13 AM GMT

X
Telugu Gateway24 Feb 2018 4:13 AM GMT
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వైపు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు సినిమాల్లోనూ బిజీగా సాగుతున్నారు. ఇఫ్పటికే రజనీకాంత్ నటించిన సినిమాలు కాలా, 2.ఓ విడుదల కావాల్సి ఉంది. రకరకాల కారణంతో 2.ఓ సినిమా విడుదలలో విపరీత జాప్యం జరుగుతోంది. త్వరలోనే కాలా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించటానికి రెడీ అయ్యారు. కార్తీక్ సుబ్బరాజు పిజ్జా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఈ దర్శకుడు రజనీ కోసం ఓ కథను సిద్ధం చేయగా..ఇది ఈ సూపర్ స్టార్ కి కూడా బాగా నచ్చింది. దీంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పేశాడు. రజనీ కాలా సినిమా విడుదల ముహుర్తం ఇప్పటికే ఖరారైంది. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2.ఓ విడుదలపై మాత్రం ఇంత వరకూ క్లారిటీ లేదు.
Next Story
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT