Telugu Gateway
Telangana

యూత్ కు ప్రియా ప్రకాష్ ‘ఫీవర్’

యూత్ కు ప్రియా ప్రకాష్ ‘ఫీవర్’
X

కంటిచూపుతో దేశంలోని యూత్ ను అలా పడేసిన ప్రియా ప్రకాష్ వారియర్ తన హవాను కొనసాగిస్తోంది. గత కొన్ని రోజులుగా కనుపాపలతో ప్రేమ ఆట ఆడిన ఈ చిన్నది ఇప్పుడు ఓ ఫ్లయింగ్ కిస్ తో కేక పుట్టిస్తోంది. ఏ మాత్రం ఊహించని రీతిలో ప్రియాకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించటంతో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించి కొత్త టీజర్ ను విడుదల చేసింది. ఇది కూడా రికార్డులు బద్దులు కొడుతోంది. ఓవర్‌నైట్‌ సెన్సేషనల్‌ స్టార్‌ అయిన ఈ పదెనిమిదేళ్ల అమ్మాయి గురించి సూపర్‌ స్టార్లు మొదలు టీనేజ్‌ అబ్బాయిల వరకు ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రేమికుల రోజు కానుకగా ఒక తూటాలాంటి ముద్దుతో యువకుడి గుండెను ప్రేమతో పేల్చేసిన ఆమె మరో వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

‘ఒరు ఆదార్‌ లవ్‌’ అనే మలయాళ సినిమాతో ప్రియాప్రకాశ్‌ వారియర్‌ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కనుసైగలతో, కన్నుగీటుతూ యువకుడిని ప్రేమమైకంలో ముంచెత్తే ప్రియాప్రకాశ్‌ వీడియో ఇప్పటికే సెన్సేషనల్‌ అయింది. ఈ ఒక్క వీడియోతో ఓవర్‌నైట్‌ ఆమె నేషనల్‌ స్టార్‌ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మిలియన్‌కుపైగా ఫాలోవర్లు యాడ్‌ అయ్యారు. మార్చి 3న విడుదల కానున్న ఈ సినిమాకూ విశేషమైన్‌ క్రేజ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఒరు ఆదార్‌ లవ్‌’ సినిమా టీజర్‌ను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రియ.. ఒక ఫ్లయింగ్‌ కిస్‌ని గన్‌లా మార్చి తూటాలా పేల్చితే.. అది తగిలి ఆమె లవర్‌ విలవిలలాడుతాడు. ఇదీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

https://www.youtube.com/watch?v=pC2yUlN2kMU

Next Story
Share it