Telugu Gateway
Cinema

‘ఛలో’ హీరోకు కాస్ట్లీ కార్ బహుమతి

‘ఛలో’ హీరోకు కాస్ట్లీ కార్ బహుమతి
X

నాగశౌర్యకు ‘ఛలో’ మాంచి కిక్ ఇచ్చిన సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో ఈ కుర్రహీరో ఫుల్ కుషీగా ఉన్నాడు. అంతే కాదు..సినిమా దర్శకుడికి ఓ కారు బహుమతిగా ఇచ్చిన నిర్మాత..హీరో నాగశౌర్యకు కూడా కాస్ట్లీ కారును బహుమతిగా అందజేశారు. ఈ సినిమాను నిర్మించింది స్వయంగా హీరో నాగశౌర్య తల్లి ఉషా మల్పూరి అన్న సంగతి తెలిసిందే. తాను నిర్మాతగా వ్యవహరించిన సినిమా సూపర్ హిట్ కావటంతో ఆమె నాగశౌర్యకు పోర్షే 718 కెమెన్‌ అనే కారును కొనిచ్చారని టాక్. కారు విలువ దాదాపుగా రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా.

నాగశౌర్య తన ఇంటి వద్ద కారుతో దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ బాక్సాఫిస్‌ దగ్గర మంచి కలెక్షన్లు వసూలు రాబట్టింది. ‘ఛలో’ చిత్రానికి వెంకీ కుడుముల డైరెక్టర్‌. హీరోయిన్‌గా రష్మికా మండన్న నటించింది. ఈ సినిమాను చాలా వినోదాత్మకంగా రూపొందించారు. త్వరలో నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా ‘కణం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it