Telugu Gateway
Cinema

‘మెహబూబా’ షూటింగ్ పూర్తి

‘మెహబూబా’ షూటింగ్ పూర్తి
X

టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ తన కొడుకును హీరోగా నిలబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఇప్పటికే ఓ సారి ‘ఆంధ్రాపోరి’ సినిమాతో ఆకాష్ ప్రేక్షకుల ముందుకు వచ్చినా..బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. అందుకే ఈ సారి ఎలాగైనా తన కొడుకు కు హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ ప్రేమ కథను తీసుకుని పక్కా ప్లాన్ చేశాడు. భారత్, పాక్ యుద్ధ సమయంలో జరిగిన ప్రేమ కథను తెరకెక్కించాడు పూరీ.

ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని..ఎంతో ఉత్సాహంతో తిరిగి ఇళ్ళకు వెళుతున్నామని ఛార్మి ట్విట్టర్ లో తెలిపింది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. తాజాగా డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌, ప్యాచ్‌ వర్క్‌ తో సహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.

Next Story
Share it