Telugu Gateway
Cinema

‘కీరవాణి’కి చిక్కులు తప్పవా!

‘కీరవాణి’కి చిక్కులు తప్పవా!
X

సంచలనం రేపిన గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) అశ్లీల చిత్రం ఇప్పుడు కొత్త దుమారం రేపుతోంది. అసలు ఈ ఫిల్మ్ తెరకెక్కుతున్న సమయంలోనే పెద్ద దుమారం రేపింది. అయినా సరే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను అనుకున్నట్లే చిత్రాన్ని తెరకెక్కించి ఆన్ లైన్ లో విడుదల చేశారు. దీనిపై జరిగిన టీవీ చర్చల్లో వర్మ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఆయన్ను పోలీస్ స్టేషన్ గడప తొక్కేలా చేశాయి. ఏకంగా ఆయనపై కేసు నమోదు కావటంతో పాటు..సీసీఎస్ పోలీసులు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే.

ఈ శుక్రవారం నాడు మరోసారి ఆయన పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. ఈ తరుణంలో జీఎస్టీకి మ్యూజిక్ అందించిన కీరవాణి కూడా చిక్కుల్లో పడే సూచనలు కన్పిస్తున్నాయి. ఆయనకు కూడా నోటీసులు ఇఛ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయనతో పాటు ఆ సిరీస్‌కు సంబంధించి పని చేసినట్లు అనుమానిస్తున్న ప్రతి ఒక్కరినీ విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Next Story
Share it