అదంతా ఫేక్ న్యూస్...వర్మ
BY Telugu Gateway1 Feb 2018 8:23 PM IST
X
Telugu Gateway1 Feb 2018 8:23 PM IST
గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) అప్రతిహతంగా ముందుకు సాగుతుందని..ఈ ప్రసారం ఆగిపోయిందనే వార్తలు ఫేక్ అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. జీఎస్టీ ప్రస్తుతం విమియోలో వీడియో అందుబాటులో లేకపోవడానికి కారణాలను కూడా వెల్లడించారు.
‘స్ట్రయిక్ ఫోర్స్ ఎల్‌ఎల్‌సీ నిర్మాతలు ఫైరసీ వెబ్‌సైట్‌గా భావించి ఫిర్యాదు చేయడంతో కాపీరైట్ చర్యల్లో భాగంగా విమియో జీఎస్టీ వీడియోను తొలగించింది. నిర్మాతలకు చెందిన అధికారిక వెబ్ సైట్‌లో గాడ్స్ సెక్స్ అండ్ ట్రూత్ వీడియో యాక్టివ్‌గా ఉంది.’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా జోడించాడు వర్మ.
Next Story