Telugu Gateway
Cinema

‘చల్ మోహన్ రంగ’ టీజర్ విడుదల

‘చల్ మోహన్ రంగ’ టీజర్ విడుదల
X

నితిన్ కొత్త సినిమా ప్రమోషన్ జోరందుకుంది. ఇటీవలే చిత్ర టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా టీజర్ ను విడుదల చేసింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ టీచర్ విడుదల చేశారు. ఇది ముఖ్యంగా లవ్ స్టోరీ కావటంతో యూత్ కు కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ పనిచేశారు. టీజర్ లో భయ్యా..అసలు మీ లవ్ స్టోరీ ఏంటి అని అడగ్గానే...'వర్షాకాలం కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకొని.. వేసవికాలంలో విడిపోయాం' అంటూ తన లవ్‌స్టోరిని చెప్పేస్తాడు.

ఇది కాగానే మీరు వెదర్ రిపోర్టర్సా అంటూ ఓ కామెంట్ విన్పిస్తుంది. ఈ టీజర్‌లో నితిన్‌, మేఘా ఆకాష్ లు కూల్‌ లుక్స్ తో కన్పిస్తారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రేష్ట్‌ మూవీస్, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నితిన్‌కు కెరీర్‌లో 25వ సినిమా. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=MmuLPGu58bQ

Next Story
Share it