Telugu Gateway
Politics

కార్తీ చిదంబరం అరెస్ట్

కార్తీ చిదంబరం అరెస్ట్
X

సంచలనం. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. గత కొంత కాలంగా సీబీఐ, ఈడీ అధికారులు ఆయనపై నమోదు అయిన కేసులను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఫెమా(ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌) నిబంధనల ఉల్లంఘన, కేసుకు సహకరించడం లేదని ఆరోపణలతో బుధవారం ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకుంది. చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు మారిషస్‌నుంచి పెట్టుబడులనుఅందుకునే విషయంలో ఫారెన్ ఇన్వెస్ట్‌ మెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలను ఐఎన్ఎక్స్ మీడియా ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి.

ఈ కేసులో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంపై దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. అలాగే ఐఎన్‌ఎక్స్‌ మీడియా డైరెక్టర్లు - పీటర్, ఇంద్రాణి ముఖర్జీలతో సహా నిందితులపై ఎన్ఐఆర్ఐఆర్ నమోదు చేశారు. చిదంబరం గత కొన్ని రోజులుగా మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ..రాజకీయ కక్షతోనే తన కొడుకును వేధిస్తున్నారని ఆరోపించారు. ఇది చిదంబరానికి ఇబ్బందికర పరిస్థితే.

Next Story
Share it