అట్టసూడకే అంటున్న అల్లు అర్జున్
BY Telugu Gateway14 Feb 2018 5:12 AM GMT

X
Telugu Gateway14 Feb 2018 5:12 AM GMT
అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’. ఈ సినిమాకు సంబంధించిన ‘అట్టసూడకే..కొట్టినట్టుగా అట్టసూడకే. సిట్టిగుండకే..ఊరికూరికే సొట్టపెట్టకే’ అంటూ ముందుకు సాగే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా కన్పించనున్నారు. చాలా సీరియస్ నెస్ ఉన్న పాత్ర ఇది. ఇప్పటికే విడుదలైన చిత్రాలు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాయి. ఈ వేసవి లో బరిలో అల్లు అర్జున్ నా పేరు సూర్య, మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అను నేను సినిమాలు తలపడనున్నాయి.
Next Story