Telugu Gateway
Telugu

పాక్ కు షాకిచ్చిన ట్రంప్

కొత్త సంవత్సరం తొలి రోజే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ కు షాకిచ్చారు. పాక్ ఉగ్రవాదుల ప్రోత్సాహం ఇక సాగదని..ఆ దేశానికి ఇక తాము నిధులు ఇచ్చేదిలేదని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పాక్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు ఏటా వేల కోట్ల డాలర్ల నిధులు కుమ్మరించినా తమకు సాయం చేయకపోగా అసత్యాలు, మోసపూరిత వైఖరితో ద్రోహం చేసిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

గత 15 ఏళ్లుగా పాక్‌కు అమెరికా 3300 కోట్ల డాలర్ల సాయం అందించినా అందుకు ప్రతిగా అసత్యాలు, మోసం మినహా ఆ దేశం తమకు చేసిందేమీలేదని ఆరోపించారు. అమెరికన్‌ నేతలను వాళ్ళు వెర్రివెంగళప్పల్లా భావిస్తూ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్నారని విమర్శించారు. ఆప్ఘనిస్తాన్‌లో తమ కార‍్యకలాపాలకు భాగస్వామి హోదాలో పాక్‌ భారీగా లబ్ధిపొందినా తమకు ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించారు. భవిష్యత్ లో పాక్‌కు ఒక్క పైసా ఇవ్వబోమని స్పష్టం చేశారు.

Next Story
Share it