Telugu Gateway
Cinema

ట‌చ్ చేసి చూడు టైటిల్ సాంగ్ వ‌చ్చేసింది

ట‌చ్ చేసి చూడు టైటిల్ సాంగ్ వ‌చ్చేసింది
X

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఫుల్ ఎన‌ర్జీతో దూసుకొస్తున్నాడు. రాజా ది గ్రేట్ అంటూ దుమ్మురేపిన ఈ హీరో ఇప్పుడు ట‌చ్ చేసి చూడు అంటూ స‌వాల్ విసురుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో ర‌వితేజ ఫుల్ జోష్ లో క‌న్పిస్తున్నాడు. ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ర‌వితేజ‌. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రవితేజకు జోడీగా ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌ గా నటిస్తుంది.

రవితేజ క్యారెక్టరైజేషన్ కు సంబంధించిన ఈ పాటకు మార్క్‌ డి మ్యూస్‌ సంగీతం అందించ‌గా చంద్రబోస్ సాహిత్యమందించారు. బ్రిజేష్ శాండిల్య, శ్రీరామ్ చంద్రలు ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర నిర్మాత‌లు. రాజా ది గ్రేట్ సినిమా సూప‌ర్ హిట్ కావ‌టంతో ర‌వితేజ అభిమానులు ఈ సినిమా కూడా హిట్ అవుతుంద‌నే ధీమాతో ఉన్నారు.

https://www.youtube.com/watch?v=BGBUbwJMTKk

Next Story
Share it