‘పవన్ కళ్యాణ్’కు తెలంగాణ సర్కారు ఝలక్
BY Telugu Gateway9 Jan 2018 4:28 PM IST
X
Telugu Gateway9 Jan 2018 4:28 PM IST
పవన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రీమియర్ షోలకు భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తొక్కిసలాటలు జరిగే ప్రమాదం ఉందని, అందుకే అర్ధరాత్రి తర్వత ప్రీమియర్ షోలకు అనుమతి నిరాకరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోల కోసం భ్రమరాంబ, మల్లికార్జున, ఆర్కే థియేటర్లు పోలీసులు అనుమతి కోరిన నేపథ్యంలో భద్రత కారణాల వల్ల పోలీసులు నిరాకరించారు. గతంలో కూడా ప్రీమియర్ షోలు వేసినప్పుడు పలుచోట్ల తొక్కిసలాటలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అభిమానులు సహకరించాలని పోలీసులు కోరారు.
Next Story