Telugu Gateway
Telangana

తత్కాల్ పాస్ పోర్టు.. ఇక మరింత సులభం

తత్కాల్ పాస్ పోర్టు.. ఇక మరింత సులభం
X

పాస్ పోర్టు జారీ మరింత సులభతరం కానుంది. ఇఫ్పటికే పాస్ పోర్టుల జారీ వేగంగా జరుగుతుండగా..ఇప్పుడు తత్కాల్ పాస్ పోర్టు జారీ ని మరింత సరళతరం చేశారు. ఇంతవరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం తత్కాల్ పాస్ పోర్టు పొందాలంటే ఐఏఎస్ లేదా ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల నుంచి లేఖ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పద్దతిని తొలగించారు. నేరుగానే పాస్ పోర్టు జారీ చేయనున్నారు. ‘ఇకపై తత్కాల్‌ పద్దతి కింద పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకునేవారు ఒక స్వయం ప్రకటిత (సెల్ఫ్‌ డిక్లరేషన్‌) పత్రంతో పాటు.. ఆధార్‌కార్డు/ఆధార్‌ నమోదు నంబరు, గుర్తింపు/నివాస ధ్రువీకరణకు సంబంధించిన 12 పత్రాల్లో ఏవైనా రెండింటిని సమర్పిస్తే సరిపోతుంది. ఇప్పుడు పోలీసు వెరిఫికేషన్ ముందే పాస్ పోర్టు జారీ చేసి..తర్వాత వెరిఫికేషన్ చేయనున్నారు.

తత్కాల్‌ మొదటి కేటగిరీ రుసుం రూ. 3,500 (రూ. 1,500 సాధారణ ఫీజు, రూ. 2వేలు అదనపు చార్జీలు) చెల్లిస్తే.. మూడు రోజుల్లో పాస్‌పోర్టును జారీ చేస్తారు. ఒకవేళ పైన పేర్కొన్న డాక్యుమెంట్లు జతచేసి, రూ. 1,500 (సాధారణ ఫీజు) చెల్లిస్తే.. తత్కాల్‌ రెండో కేటగిరీ కింద పరిగణించి మూడు నుంచి ఏడు రోజుల్లో పాస్‌పోర్టును జారీ చేస్తారు’. ఈ మూడు కీలక డాక్యుమెంట్లు ఉంటే చాలు.. ఇక పాస్‌పోర్టు మూడు రోజుల్లో వస్తుంది. తత్కాల్ పాస్ పోర్టు జారీకి సంబంధించిన నిబంధనలను కేంద్రం తాజాగా సవరించింది. ఈ విషయాలను హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌ రెడ్డి మీడియాకు తెలిపారు.

Next Story
Share it