తమన్నా సంబరం
BY Telugu Gateway20 Jan 2018 10:14 AM IST
X
Telugu Gateway20 Jan 2018 10:14 AM IST
దశాబ్దం తర్వాత కూడా టాలీవుడ్ లో తమన్నా తన హవాను కొనసాగిస్తోంది. ప్రారంభంలో ఉన్నంత జోరు లేకపోయినా సినిమాలు మాత్రం ఆగటం లేదు. ఈ భామ తెలుగుతోపాటు తమిళంలో కలుపుకుని ప్రస్తుతం ఐదు చిత్రాలు చేస్తోంది. తాను ఊహించని రీతిలో మంచి కథలతో కూడిన సినిమాలు తాను చేస్తున్నట్లు సంబరపడిపోతోంది ఈ మిల్కీ బ్యూటీ. కొత్త సంవత్సరం తనకు లక్కీ ఇయర్ గా మారిపోనుందని ధీమాతో ఉంది. తెలుగులో క్వీన్ అనే రీమేక్ లో నటిస్తోంది తమన్నా.
గతంలో పోషించని పాత్రలతో ఈ సినిమాలు చేస్తున్నట్లు తమన్నా చెబుతోంది. తెలుగు, తమిళంతోపాటు హిందీ భాషలతో కలుపుకుని అమ్మడి చేతిలో మొత్తం ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్ల కోసం కథలు సిద్ధం చేసే పరిస్థితి వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తోంది. తమన్నా చెబుతున్నట్లు ఆమెకు ఈ కొత్త చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో వేచిచూడాల్సిందే.
Next Story