Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ భామ!

ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ భామ!
X

త్వరలోనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫ్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త వెలుగులోకి వస్తోంది. ఓ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. జైలవకుశ వంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావటంతో దీనిపై ఆయన అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్లుగా అను ఇమాన్యుయల్, పూజా హెగ్డెలను ఖరారు చేసినట్లు గత కొంత కాలంగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ తాజా సినిమా అజ్ణాతవాసిలోనూ అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో జతకట్టనున్న హీరోయిన్ గా బాలీవుడ్ భామ పేరు తెరపైకి వచ్చింది. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న శ్రద్ధా కపూర్‌ను ఎన్టీఆర్‌కు జోడిగా నటించనుందని టాక్. దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఎన్టీఆర్ కొత్త సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాను మదు బాబు నవల ఆధారంగా తెరకెక్కించనున్నారు. దీని కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ కోసం బరువు తగ్గే పనిలో ఉన్నారు.

Next Story
Share it