రవితేజకు జోడీగా నివేథా!

గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు చేసే పనిలో పడ్డాడు. సుదీర్గ విరామం తర్వాత ఈ మాస్ మహారాజ చేసిన సినిమా రాజా ది గ్రేట్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇప్పుడు కొత్తగా టచ్ చేసి చూడు అంటున్నాడు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా రాశీ ఖన్నా, సీరత్ కపూర్ లు సందడి చేయనున్నారు. ఓ వైపు టచ్ చేసి చూడు విడుదలకు రెడీ కాగా..మరో వైపు నేల టికెట్ సినిమాకు ఓకే చెప్పేశాడు. అంతే కాదు...కొత్తగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ ఎనర్జిటిక్ హీరో.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ సరసన నివేథా థామస్‌ను హీరోయిన్ గా నటించనున్నట్లు టాలీవుడ్ టాక్. నివేథా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో జోరు చూపించిన రవితేజ రెండవ ఇన్నింగ్స్ లోనూ అదే జోష్ కొనసాగిస్తున్నాడు.