Telugu Gateway
Cinema

అజ్ఞాతవాసిపై వర్మ రియాక్షన్ ఇది

అజ్ఞాతవాసిపై వర్మ రియాక్షన్ ఇది
X

గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతవాసి సినిమాపై స్పందించారు. ఆయన స్పందన ఎలా ఉందో మీరే చూడండి. పవన్‌ కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్‌ చిత్రమైన ‘పులి’ ని చూసినట్లుందని సెటైర్లు వేశాడు. అంతేకాకుండా సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి రివ్యూ బాగుందంటూ కితాబిచ్చాడు. ‘నేను ఓ పులిని మాత్రమే చూశాను. కోరలు, పంజాలేని పులిని ఇప్పటి వరకు చూడలేదు. కానీ పులి చారలు మారడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. జంపింగ్‌ చేయాల్సిన పులి పాకడం మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించి సమీక్షలు అన్నీ ఇంచుమించు ఒకే అభిప్రాయం వ్యక్తంచేయగా...పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా నిరాశచెందారు. అయితే ఎక్కువ మంది పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా చూసిన చాలా మంది ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం కంటే పవన్ కళ్యాణ్ దర్శకత్వం చేసినట్లు కన్పిస్తోందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it