Telugu Gateway
Politics

జై తెలంగాణ నినాదం..వందేమాత‌రం ఒక‌టే

జై తెలంగాణ నినాదం..వందేమాత‌రం ఒక‌టే
X

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంగ‌ళ‌వారం నాడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్రాంతం అంటే త‌న‌కు ఎంతో అభిమానం అని...

ఆంధ్రప్ర‌దేశ్ త‌న‌కు జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మలాంటిద‌ని వ్యాఖ్యానించారు. అలాంటి తెలంగాణ నేల తల్లికి నేను ఆఖరి శ్వాస వరకూ రుణపడి ఉంటానన్నారు. వందేమాతరం లాగా.. జై తెలంగాణ కూడా ఓ గొప్ప నినాదం, మంత్రం అని వ్యాఖ్యానించారు. అలాంటి తెలంగాణ నుంచి, కరీంనగర్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నందుకు త‌న‌కు ఆనందంగా, గర్వంగా ఉంద‌న్నారు. ప్రతిభావంతులను వెలికితీసి.. జనసేన వేదిక ద్వారా కొత్త రాజకీయాన్ని సృష్టించనున్న‌ట్లు తెలిపారు. . మార్చి14 జనసేన ఆవిర్భావం నాటికి పూర్తిగా విధివిధానాలు రెడీ చేస్తామని తెలిపారు. కులాలలను కలిపే రాజకీయ విధానం.. మతప్రస్తావన లేని రాజకీయాలు త‌మ‌ లక్ష్యమ‌న్నారు. బుద్ధుడు చెప్పినట్టు త‌న‌ను ద్వేషించే వాళ్ళ గురించి ఆలోచించే స‌మ‌యం త‌న‌కు లేద‌న్నారు. నా సమయమంతా నన్ను ప్రేమించేవాళ్ళకోసమే. తెలంగాణ భావోద్వేగాలు నాకు దగ్గరగా ఉంటాయి. అందుకే తెలంగాణ అంటే నాకిష్టం. నేను తెలంగాణ వ్యతిరేకిని కాను. నా సినిమాల్లో తెలంగాణ భాషను, యాసను, కవులను ప్రోత్సహిస్తూ వచ్చాను. తెలంగాణ నాయకులందరికీ విన్నపం నేనెవ్వరికీ వ్యతిరేకం కాదు. కాన్షీరాం, అంబేడ్కర్, పూలే విధానాలననుసరించి.. మేము ముందుకెళ్తున్నాం. అన్ని కులాల్లోనూ ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఆర్థికభద్రత అందరికీ అందాలి. మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయాలి. భారత్ హిందుదేశమైనప్పటికీ.. మన జాతీయ నాయకుల చొరవతో సెక్యులర్ రాజ్యంగా ఉన్నాం.

తెలంగాణ భాషకు చాలావరకు గౌరవం దక్కలేదు. తెలంగాణ పండుగలు, సంప్రదాయాల గురించి నా సినిమాల్లో చెప్పాను. మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క ఇలా ప్రతీ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం దక్కాలి. అదే సమయంలో ప్రాంతీయను విస్మరించని జాతీయవాదమే జనసేన లక్ష్యం. అవినీతిపై జనసేన పోరాటం. సైన్స్ అండ్ టెక్నాలజీని.. పర్యావరణానికి హాని కల్గించకుండా చేయడమే జనసేన లక్ష్యం. మా అన్న కూడా కాంగ్రెస్ నాయకుడే. కేసీఆర్ ను మెచ్చుకుంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కోపం వచ్చింది. రాష్ట్రం విడిపోయి కేవలం మూడున్నరేళ్ళు మాత్రమే అయింది. తెలంగాణ పసిబిడ్డ. ప్రధాని చెప్పినట్టు.. తల్లి నుంచి విడిగొట్టిన పసిబిడ్డ తెలంగాణ. నాకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం. కొన్ని విషయాల్లో విబేధించవచ్చును కూడా. తెలంగాణ కవులు, కళాకారులు నాకు సన్నిహితులు. ప్రపంచ తెలుగుమహాసభలప్పుడు కూడా కొంతమందితో అదే చెప్పాను. నేను కోరేది ఒక్కటే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులున్నాయి. విభేధించడం.. గొడవపడడం నాకు ఆఖ‌రి అస్త్రాలు. పరిస్థితులు కుదరనప్పుడే సమరం ప్రకటిస్తా.తెలంగాణ. ఉద్యమస్ఫూర్తే.. జనసేన పార్టీ అనుసరిస్తుంది. ఇప్పుడిప్పుడే అవతరించిన పార్టీ ఇది. కాబట్టి పాతికేళ్ల సమయం వరకూ మనం ఓర్పు వహిద్దాం.నేను చాలా మొండివాణ్ని. దాడులు చేసినా వెరవను, భయపడను. మాట ఇస్తే మడమతిప్పే ప్రసక్తేలేదు. ఏపార్టీలో విలీనం.చేయను. 2019లో తెలంగాణ లో ఎన్నికల బరిలో ఉంటాం. జనసేన తెలంగాణ ఆడపడుచుల ఆకాంక్ష, యువత ఆకాంక్ష, ఉద్యమ కారుల ఆకాంక్ష. నన్నో అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా ఆశీర్వదించండి. అప్పుడప్పుడు నేను రాజీ పడ్డట్టుంటుంది. కానీ నేను రాజీపడను. నాకు లక్షల కోట్లు అక్కరలేదు.. మీప్రేమ ఉంటే చాలు. నాకు పదవులు అక్కర.లేదు. ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ పోరాటం జరిగిందో అందుకోసం నేను కూడా మీలో ఒకడిగా పోరాడుతాను అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌కటించారు.

Next Story
Share it