కిరాక్ పార్టీలో ‘అదరగొడుతున్న’ నిఖిల్

టాలీవుడ్ కుర్ర హీరోల్లో ‘నిఖిల్’ కొత్త తరహా ప్రయోగాలతో దూసుకెళ్తున్నాడు. రొటీన్ సినిమాలు కాకుండా కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూ సక్సెస్ సాధిస్తున్నాడు. ఇప్పుడు అలాంటిదే మరో ప్రయోగం చేస్తున్నట్లు కన్పిస్తోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమానే ‘కిరాక్ పార్టీ’. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో నిఖిల్ డైలాగులు..యాక్షన్ చూస్తుంటే ఈ సినిమా కూడా కొత్తదనంతో కూడుకున్నట్లు కన్పిస్తోంది.
ఈ ట్రైలర్ లో ‘కృష్ణుడొచ్చాడురా... ఇక కురుక్షేత్రమే’ అంటున్నాడు హీరో నిఖిల్. కాలేజీ రాజకీయాలు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడంలో ఘనవిజయం సాధించిన 'కిరిక్ పార్టీ'కి రీమేక్. నిఖిల్, సంయుక్తా హెగ్డే, సిమ్రన్ పరీంజా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇందులో. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాలీగా, అల్లరిచిల్లరిగా కాలేజీ జీవితాన్ని ఎంజాయ్ చేసే విద్యార్థిగా, మాస్ లుక్ కలిగిన స్టూడెంట్ లీడర్‌గా విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రను నిఖిల్ పోషిస్తై ఫుల్ జోష్ లో కన్పిస్తాడు.
https://www.youtube.com/watch?v=teenjAQh5yY