Telugu Gateway
Telugugateway Exclusives

నారా లోకేష్...నెలకోసారి అమెరికా పర్యటన

నారా లోకేష్...నెలకోసారి అమెరికా పర్యటన
X

‘ఎవరైనా నెలకో సారి పెట్టుబడులు ఆకర్షిస్తారా?. అలా నెలకోసారి అమెరికా తిరుగుతూ ఉంటే పెట్టుబడులు పరుగులు పెడుతుంటాయా? ఏమో..ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఆయన గత నెలలోనే అంటే 2017 డిసెంబర్ లో 13 నుంచి 16 వరకూ అమెరికాలో పర్యటించి వచ్చారు. అది కూడా పెట్టుబడుల ఆకర్షణ కోసం. నారా లోకేష్ గత పర్యటనలో గూగుల్ ఎక్స్ ఏపీలోని విశాఖపట్నంలో తన యూనిట్ ఏర్పాటు చేయటానికి అంగీకరించిందని ప్రకటించారు. సరిగ్గా నెల రోజులు దాటిందో లేదో మళ్ళీ నారా లోకేష్ అండ్ టీమ్ పెట్టుబడుల సాధన పేరుతో మరోసారి అమెరికా యాత్రకు రెడీ అయిపోయారు. ఆయనతోపాటు ఓ భారీ టీమ్ వెళుతుంది సర్కారు ఖర్చుతో. అందులో ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో ప్రధాన పాత్రదారిగా ప్రచారం జరుగుతున్న వేమూరి హరిప్రసాద్ తోపాటు ఆయన సోదరుడు ఎపీఎన్ ఆర్ టి సలహాదారు వేమూరి రవికుమార్, ప్రభుత్వ ఐటి సలహాదారు జె ఏ చౌదరి తదితరులు ఉన్నారు.

ఏపీఎన్ ఆర్ టి పేరుతో చిన్న చిన్న ఐటి కంపెనీలను తెస్తూ హంగామా చేస్తున్నారు తప్ప..ప్రతిష్టాత్మక ఐటి కంపెనీలు ఏవీ ఏపీ వైపు చూడటం లేదని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మళ్ళీ ఐటిలో ఏకంగా ఎంత మంది సలహాదారులు ఉన్నారో తెలిస్తే అవాక్కు అవ్వాల్సందే. ఐటి శాఖలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జె. సత్యనారాయణతో పాటు జె ఏ చౌదరి సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్ ఆర్ టి సలహాదారు రవికుమార్ దీ అదే పని. ఏపీ ఫైబర్ లిమిటెడ్ సలహాదారు హరిప్రసాద్ అదేపనిలో. బహుశా ఒక్క శాఖలో ఇంత మంది సలహాదారులు ఏ ప్రభుత్వంలో కూడా ఉండరేమో. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్ళారు. ఆయనతోపాటు మంత్రి లోకేష కూడా వెళ్ళారు. పోనీ ఈ పర్యటన ద్వారా ఏమైనా కాంక్రీట్ గా ఏదైనా ఫలితాం సాధించారా? అంటే అదీ లేదు. కానీ నారా లోకేష్ మాత్రం నెలకో సారి అమెరికా వెళుతూ ఉన్నారు. ప్రభుత్వ డబ్బే కదా?.

Next Story
Share it