రోజా ఇంట్లో పది లక్షల బంగారం చోరీ

X
Telugu Gateway22 Jan 2018 9:32 AM GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకు దొంగలు షాక్ ఇచ్చారు. ఆమె ఇంట్లో నుంచి ఏకంగా పది లక్షల రూపాయల విలువ చేసే బంగారు అభరణాలు చోరీ చేసినట్లు సమాచారం. మణికొండలోని ఆమె నివాసంలో దొంగతనం జరిగింది. దొంగలు ఇంట్లోంచి రూ. 10లక్షలు విలువచేసే బంగారం, వెండి అభరణాలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చునని రాయదుర్గం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే రోజా నివాసానికి చేరుకొని పరిశీలించారు.
Next Story