చిరు అల్లుడి కొత్త సినిమా షురూ

కొన్ని రోజులు అలా చెప్పుకోవాల్సిందే మరి. హీరో కళ్యాణ్ అంటే ఆయనెవరబ్బా అనుకోవాల్సిన పరిస్థితే కదా ప్రస్తుతం. ఆయన హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ అయ్యేవరకూ ఈ తిప్పలు తప్పడు. ట్యాగ్ లు ఉండాల్సిందే మరి. లేకపోతే గుర్తుపట్టడం కష్టమే. ఇక అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా కొత్త సినిమా బుధవారం నాడు షురూ అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్ నటించనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం తెల్లవారుజామున వారాహి చలనచిత్రం ఆఫీసులో జరిగాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకులు రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎన్వీ ప్రసాద్, గుణ్ణం గంగరాజు, కళ్యాణ్ కోడూరి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. దర్శకధీరుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ‘చిరంజీవి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాకేష్ శశి ప్రిపేర్ చేసిన అద్భుతమైన కాన్సెప్ట్ ను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నాం. ‘బాహుబలి’ చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. ‘రంగస్థలం’ చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు.
నాలుగేళ్ల తర్వాత పారిశ్రామికవేత్తలకు కాపలా కాయాలా?
27 Jun 2022 12:45 PM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTబిజెపి నిరంకుశ తీరుకు వ్యతిరేకంగానే...కెటీఆర్
27 Jun 2022 11:58 AM GMTటీచర్ల ఆస్తుల దగ్గర మొదలై..కెసీఆర్ ఆస్తుల వరకూ...
25 Jun 2022 4:06 PM GMTఅమ్మకానికి అమరావతి భూములు
25 Jun 2022 2:06 PM GMT
సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMTరాజీనామాకు రెడీ..పదవుల కోసం పాకులాడను
22 Jun 2022 2:28 PM GMT'మహా' ట్రబుల్ షురూ
21 Jun 2022 5:51 AM GMTఅసలు మోడీ తల్లి వయస్సు ఎంత?
20 Jun 2022 3:43 PM GMTమోడీ సర్కారు ఆరోపణల విముక్తి పథకం
20 Jun 2022 12:10 PM GMT