Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘దుమ్మురేపుతున్న’ అనుష్క

0

అనుష్క ‘భాగమతి’గా దుమ్మురేపుతోంది. ఈ సినిమా చేస్తున్న వసూళ్లే అనుష్క సత్తాను చాటుతున్నాయి. భాగమతి పాత్రలో అనుష్క ఈ సినిమా  సినిమాలో కన్పించేది అతి తక్కువ సమయం అయినా..కన్పించిన అంత సేపు మాత్రం తన విశ్వరూపం చూపారు. ఈ నటనకు గాను అనుష్కకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఊహించని మలుపులు..ట్విస్ట్ లతో సినిమా ముందుకు సాగటంతో ప్రేక్షకులను ఇది సినిమా ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని చిత్ర వసూళ్ళు కూడా నిర్ధారిస్తున్నాయి. భాగమతి సినిమా  మొదటిరోజు మొత్తం రూ. 12 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

అమెరికాలో 1,56, 538 డాలర్లు వసూలు చేసింది. దక్షిణాదిలో మహిళ ప్రాధాన్యమున్న చిత్రాల్లో అత్యధిక ప్రారంభం వసూళ్లు సాధించిన చిత్రంగా భాగమతి నిలిచింది. దీనికి తోడు పాజిటివ్‌ టాక్‌, రివ్యూలు రావడంతో ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళుతోంది. తమ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ‘భాగమతి’ చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేస్తోంది. బాహుబలి 2 తర్వాత అనుష్క చేసిన సినిమా భాగమతే. దీంతో అనుష్క అభిమానులు  కూడా ఈ సినిమాతో  పండగ చేసుకుంటున్నారు.

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.