Telugu Gateway
Cinema

న్యూఇయ‌ర్ లో మ‌హేష్ బాబు సంద‌డి

కొత్త సంవ‌త్స‌రంలో మ‌హేష్ బాబు సంద‌డి చేయ‌నున్నారు. ఆయ‌న సినిమాలు రెండూ 2018లోనే విడుద‌ల కానున్నాయి. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ లేక మ‌హేష్ బాబు ఇబ్బంది ప‌డుతున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన స్పైడ‌ర్ సినిమా మ‌హేష్ కు తీవ్ర నిరాశే మిగిల్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సూపర్ స్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన శ్రీమంతుడు సినిమా మంచి హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న వీరిద్ద‌రి కాంబినేష‌న్ సినిమానే భ‌ర‌త్ అను నేను. ఈ సినిమా వేసవి కానుకగా 2018 ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని నటిస్తోంది. దీని తరువాత మహేష్ చేయబోయే సినిమా రిలీజ్ డేట్ ను కూడా అప్పుడే ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను అశ్వనిదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.ఈ సినిమా కోసం అల్ల‌రి నరేష్ బ‌రువు పెరిగే ప‌నిలో ఉన్నాడ‌ని చెబుతున్నారు. భ‌ర‌త్ అను నేను సినిమాతో అయినా త‌మ హీరో తిరిగి ట్రాక్ లోకి వ‌స్తార‌ని మ‌హేష్ బాబు అభిమానులు ధీమాగా ఉన్నారు.

Next Story
Share it