Telugu Gateway
Cinema

రవితేజ ‘టచ్ చేసి చూడు’ ఫస్ట్ లుక్

రవితేజ కొత్త సంవత్సరంలో సందడి చేయటానికి రెడీ అయిపోతున్నాడు. అందులో భాగంగానే ‘టచ్ చేసి చూడు’ సినిమా ఫస్ట్ లుక్ ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ సినిమా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ లుక్ లో బోల్తా కొట్టిన కారు దగ్గర స్టైలిష్ గా నడుచుకుంటూ పోతున్న రవితేజ కన్పిస్తారు. రాజా ది గ్రేట్ సినిమా సూపర్ హిట్ కావటంతో ఈ మహారాజా మళ్ళీ ట్రాక్ లో పడినట్లు అయింది.

ఇప్పుడు టచ్ చేసి చూడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్‌ సిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్‌కపూర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story
Share it