Telugu Gateway
Cinema

రామ్ చరణ్ ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

‘రంగ స్థలం’. రామ్ చరణ్ తన కొత్త సినిమాకు ఈ టైటిల్ ను అంగీకరించటమే ఓ సవాల్. ఎందుకంటే ప్రస్తుత తరానికి ఈ పదం పెద్దగా పరిచయం ఉండే అవకాశం లేదు. పైగా ఇదదో పాత సినిమా అనేలా ఉంటుంది. కానీ టైటిల్ విషయంలో రామ్ చరణ్ చేసింది పెద్ద ప్రయోగమే అని చెప్పొచ్చు. ఈ సినిమా ఫస్ట్ లుక్ శనివారం నాడు విడుదల చేశారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పక్కా మాస్‌ గెటప్‌.. లుంగీ అవతార్‌లో చిందులేస్తున్న రామ్‌ చరణ్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

చిట్టిబాబు పాత్రలో చెర్రీ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అంతేకాదు చిత్ర విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. మార్చి 30న చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుందని ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆదిపినిశెట్టి, అనసూయలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Next Story
Share it