ఆది..తాప్సీ జంటగా కొత్త సినిమా
BY Telugu Gateway3 Dec 2017 5:52 PM IST
Telugu Gateway3 Dec 2017 5:52 PM IST
తాప్సీ త్వరలో మరో తెలుగు సినిమా చేయనుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో ఆయనకు జోడీగా తాప్సీ నటించనుంది. గతంలో వీరిద్దరూ కలసి గుండెల్లో గోదారి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాప్సీ తాజాగా తెలుగులో చేసిన సినిమా ‘ఆనందో బ్రహ్మా’. దెయ్యం కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందింది.
తాప్సీ నటించే కొత్త సినిమాను కోన వెంకట్ ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. లవర్స్ సినిమాను తెరకెక్కించిన హరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 21న నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది.
Next Story