మోహన్ బాబు ‘గాయత్రి’ ఫస్ట్ లుక్
మోహన్ బాబు కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ వెండితెరపై సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. ఆయన నటించిన సినిమా ‘గాయత్రి’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉన్న ఓ డైలాగు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘ఆరోజు రాముడు చేసింది తప్పు అయితే..నాదీ తప్పే’ అంటూ మోహన్ బాబు సీరియస్ గా చూస్తున్న పోస్టర్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. తన డైలాగ్ డెలివరితో పాటు ఎన్నో ప్రత్యేకతలు ఉన్న మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఆయన తనయుడు మంచు విష్ణు తోపాటు శ్రియ, యాంకర్ అనసూయ, నిఖిలా విమల్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సొంత బ్యానర్ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పైనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ సినిమాకు ఆర్ మధన్ దర్శకత్వం వహిస్తున్నారు.