Telugu Gateway
Cinema

‘అజ్ఞాత వాసి’ టీజర్ 16న

‘అజ్ఞాత వాసి’ సినిమా విడుదలకు ముహుర్తం ముంచుకొస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచింది. ఇప్పటికే వరస పెట్టి పాటలు విడుదల చేస్తున్న యూనిట్..తాజాగా మరో అంశాన్ని అధికారికంగా ప్రకటించేసింది. అజ్ఞాత వాసి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కటంతో దీనిపై అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 19న ఆడియో వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ లోగానే ఫ్యాన్స్ కు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు పవన్. డిసెంబర్ 16న టీజర్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా టీజర్ ను రూపొందిస్తున్నారని సమాచారం. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు.

Next Story
Share it