‘అజ్ఞాతవాసి’లో కుష్పూ పవర్ ఫుల్ రోల్!
BY Telugu Gateway17 Dec 2017 5:50 PM IST
Telugu Gateway17 Dec 2017 5:50 PM IST
త్రివిక్రమ్ శ్రీనివాస్..పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే అంచనాలు మొదలవుతాయి. దీని వెనక బలమైన కారణం కూడా ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ పై కూడా అదే అంచనాలు ఏర్పడుతున్నాయి. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ అత్తగా నదియా యాక్షన్ సూపర్బ్ అనేలా ఉంది. ఇప్పుడు అజ్ఞాతవాసిలో కుష్పూది కూడా అదే తరహా పవర్ పుల్ పాత్రగా కన్పిస్తోంది. కుష్పూ ఈ సినిమాకు సంబంధించి ఓ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
అందులో కుష్పూ చాలా సీరియస్ గా చూస్తుంటే..పవన్ కళ్యాణ్ ఆమె వెనక చేతులు కట్టుకుని నిల్చుని ఉంటారు. ఈ సినిమా చేయటంపై కుష్పూ ఫుల్ కుషీగా ఉన్నారు. తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఆమె థ్యాంక్స్ చెబుతున్నారు. ఇలాంటి విలువైన పాత్ర కోసం కొన్ని సంవత్సరాల పాటు ఎదురుచూశానని కుష్పూ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన సినిమా టీజర్ దుమ్మురేపుతోంది. లైక్ ల విషయంలో టాలీవుడ్ లో కొత్త రికార్డు నెలకొల్పింది.
Next Story