అర్జున్ రెడ్డి ఫ్లాప్..ఇది వర్మ మాట
సంచలనం రేపిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అలా అయితే అర్జున్ రెడ్డి ఫెయిల్ అయినట్లే అంటున్నారు. అదేంటి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాను పట్టుకుని ఫెయిల్ అని ఎలా అంటారా?. అన్నదే కదా మీ డౌట్. దీనికి ఓ రీజన్ ఉందని చెబుతున్నారు వర్మ. అదేంటో మీరూ చూడండి. అర్జున్ రెడ్డి సినిమా డైరక్టర్ సందీప్ వంగా తన కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. అయితే ఆయన తన కొత్త సినిమాను కథను ముందు రామ్ గోపాల్ వర్మకు వివరించాడట. ఈ విషయాన్ని వర్మే తన ఫేస్ బుక్ లో పోస్టు ద్వారా తెలిపారు. సినిమా కథ విని తాను కుళ్లుకున్నానని..ఈ స్టోరీ విన్నాక అర్జున్ రెడ్డి సినిమా ఫెయిల్ అయినట్లేనని వ్యాఖ్యానించారు.
ఎందుకంటే సందీప్ వంగా తర్వాత సినిమా అంత మెగా సక్సెస్ అవుతుంది అని వ్యాఖ్యానించారు. నిజానికి అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ లో రామ్ గోపాల్ వర్మ పాత్ర కూడా చాలా ఉంది. ఆన్ లైన్ లో ఆయన చేసిన హంగామానే అర్జున్ రెడ్డి సినిమాకు చాలా కలిసొచ్చింది. వినూత్నమైన కాన్సెప్ట్ తో సందీప్ వంగా కొత్త్ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. వర్మ కూడా కొత్తగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తోపాటు అక్కినేని నాగార్జనతో కలసి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT